తెలంగాణ

telangana

ETV Bharat / international

మహారాజులా కాదు.. స్వతంత్రంగా జీవిస్తాం: ప్రిన్స్​ హ్యారీ - బ్రిటన్ రాజు

బ్రిటన్​ ప్రిన్స్​ హ్యారీ, ఆయన భార్య మేఘన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీనియర్​ రాజవంశీకుల హోదా నుంచి తప్పుకుని, స్వతంత్ర జీవనం గడపాలని భావిస్తున్నారు.

UK-ROYALS
UK-ROYALS

By

Published : Jan 9, 2020, 8:47 AM IST

Updated : Jan 9, 2020, 11:40 AM IST

మహారాజులా కాదు.. స్వతంత్రంగా జీవిస్తాం

బ్రిటన్​ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్​ మెర్కెల్​.. సీనియర్ రాజవంశీకుల హోదా నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఉత్తర అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్వతంత్ర జీవనం గడపాలని వారిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

"సీనియర్​ రాజవంశీకుల హోదా నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాం. బ్రిటన్​ రాణికి మా మద్దతు కొనసాగిస్తూనే ఆర్థికంగా స్వతంత్ర జీవనం గడపాలని కోరుకుంటున్నాం. కొన్ని నెలల పాటు అంతర్గతంగా చర్చించి ఈ నిర్ణయానికి వచ్చాము."

- ప్రిన్స్ హ్యారీ, మేఘన్​ మెర్కెల్

హ్యారీ ప్రకటనపై బకింగ్​హామ్ ప్యాలెస్​ స్పందించింది. ఇది క్లిష్టమైన నిర్ణయమని బ్రిటన్ రాణి ఎలిజబెత్​-2 భావిస్తున్నట్టు తెలిపింది.

"భిన్నంగా జీవించాలన్న వారి కోరికను మేం అర్థం చేసుకున్నాం. కానీ.. ఇది చాలా క్లిష్టమైన సమస్య. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కాస్త సమయం పడుతుంది."

-ఎలిజబెత్​ రాణి అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: ఇరాన్‌ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి..?

Last Updated : Jan 9, 2020, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details