బ్రెగ్జిట్ విషయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఆ దేశ పార్లమెంటులో వరుస ఓటములు తప్పడం లేదు. అక్టోబర్ 31నాటికి ఎలాంటి ఒప్పందం లేకుండా ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ప్రధానమంత్రి చేసిన ప్రయత్నాలను విపక్ష ఎంపీలతోపాటు కొందరు అధికారపక్ష ఎంపీలూ అడ్డుకున్నారు.
ఈ అంశంపై పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో ప్రధాని ప్రతిపాదనను అనుకూలంగా 299 ఓట్లు, వ్యతిరేకంగా 327 ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఎలాంటి ఒప్పందం లేకుండా బ్రెగ్జిట్‌ను అడ్డుకున్న ఎంపీలు తర్వాత అక్టోబర్ 15న ముందస్తు ఎన్నికల కోసం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఓడించారు.