తెలంగాణ

telangana

ETV Bharat / international

వైరస్​: చైనాలో 2,442కు చేరిన మృతులు

చైనాలో కరోనా మహమ్మారి స్థానికులకు కంటిపైన కునుకు లేకుండా చేస్తోంది. వైరస్​ కారణంగా 90కిపైగా ప్రజలు మరణించగా.. మృతుల సంఖ్య 2,442కు చేరింది. మరోవైపు డబ్ల్యూహెచ్​ఓ బృందం వైరస్​ కేంద్ర బిందువు వుహాన్​ నగరాన్ని సందర్శించింది. వైరస్​ వ్యాప్తిపై దర్యాప్తు చేపట్టింది.

WHO team visits Wuhan city as China's coronovirus death toll jumps to 2,442
వైరస్​: చైనాలో 2,442కు చేరిన మృతులు

By

Published : Feb 23, 2020, 10:58 AM IST

Updated : Mar 2, 2020, 6:51 AM IST

వైరస్​: చైనాలో 2,442కు చేరిన మృతులు

కరోనా ధాటికి చైనా అల్లాడిపోతోంది. తాజాగా 90మంది వైరస్​ వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీని వల్ల మృతుల సంఖ్య 2,442కు చేరింది. ఇప్పటి వరకు 76వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

వైరస్​ కేంద్రబిందువైన హుబే రాష్ట్రంలో కొత్తగా 630 కేసులను గుర్తించారు వైద్య అధికారులు. గతేడాది డిసెంబరులో మొదలైన వైరస్​.. ఒక్క హుబే రాష్ట్రంలోనే ఇప్పటివరకు 64,084మందికి సోకినట్లు అధికారులు తెలిపారు. కరోనా బారిన పడ్డ 22,888మంది రోగులను శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ చేసినట్లు వెల్లడించారు.

వుహాన్​కు డబ్ల్యూహెచ్​ఓ బృందం...

మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్​ఓ) నుంచి వచ్చిన ఆరోగ్య నిపుణుల బృందం శనివారం వుహాన్​ను సందర్శించి.. వైరస్​పై దర్యాప్తు జరిపింది. గతేడాది డిసెంబరులో వుహాన్​ నగంలోని ఓ మార్కెట్​ నుంచి ఈ వైరస్​ సోకినట్లు భావిస్తున్నారు. స్థానిక ఆరోగ్య యంత్రాంగంతో చర్చలు జరిపారు బృందంలోని సభ్యులు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Last Updated : Mar 2, 2020, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details