అఫ్గానిస్థాన్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో (Pakistan meeting on Afghanistan) అంతర్జాతీయ సమాజం సంప్రదింపులు కొనసాగించాలని (Troika Plus meeting) పాకిస్థాన్ పిలుపునిచ్చింది. అఫ్గాన్‌లో శాంతి, సుస్థిరతను నెలకొల్పడం సహా.. సుస్థిరాభివృద్ధి సాధించేందుకు ఆ దేశంతో జరిపే చర్చలు ఉపకరిస్తాయని పేర్కొంది. అమెరికా, చైనా, రష్యా దేశాల ప్రతినిధులతో కలిసి అఫ్గాన్ అంశంపై చర్చలు (Pakistan meeting on Afghanistan) ప్రారంభించడానికి ముందు పాకిస్థాన్ ఈ మేరకు సందేశాన్ని ఇచ్చింది.
"అంతర్యుద్ధం తిరిగి రావాలని ఎవరూ కోరుకోరు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఎవరికీ అవసరం లేదు. సరికొత్త శరణార్థుల సంక్షోభాన్ని మనం నివారించాలని కోరుకుంటున్నాం. ప్రాంతీయ దేశాలన్నింటికీ అఫ్గాన్ సమస్యపై ఆందోళన ఉంది. ఆ దేశంలో శాంతి, సుస్థిరత విషయంపై ఒకే విధమైన ఆలోచనలు ఉన్నాయి."
-షా మహమ్మద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి