తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో కరోనా రిటర్న్స్- 19 రాష్ట్రాల లెక్కలే సాక్ష్యం! - కరోనా వైరస్​ చైనా కేసులు

చైనాలో కరోనా వైరస్​ మరోసారి విజృంభించే అవకాశముందని ఆ దేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి హెచ్చరిస్తున్నారు. రెండు వారాల వ్యవధిలో 19 రాష్ట్రాల్లో వైరస్​ కేసులు నమోదవడం ఇందుకు ఓ కారణంగా చెబుతున్నారు. లక్షణాలు లేని​ కేసులు పెరగడం కూడా ఆందోళన కలిగించే విషయమన్నారు.

Top Chinese health official warns of COVID-19 rebound
చైనాలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. తప్పని కరోనా 2.0!

By

Published : May 4, 2020, 11:09 AM IST

చైనాను కరోనా భూతం ఇప్పట్లో వీడేలా లేదు. గత రెండు వారాల్లో 19 రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. అందువల్ల మరోసారి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని చైనా ఆరోగ్య శాఖ ఉన్నాతాధికారి ఒకరు హెచ్చరించారు.

మళ్లీ వైరస్‌ కేసులు నమోదు అవుతున్నాయని.. వైరస్‌ లక్షణాలు లేనివారికి కూడా కరోనా పాజిటివ్‌ వస్తోందని చైనా ఆరోగ్య మిషన్‌ తెలిపింది. వైరస్‌ మళ్లీ విజృంభిస్తోందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు లేని వారికి కూడా కరోనా పాజిటివ్‌ వస్తోందని చైనా అధికారులు తెలిపారు.

చైనాలో ఆదివారం కొత్తగా ముగ్గురికి వైరస్‌ నిర్ధరణ అయ్యింది . ఈ ముగ్గురు విదేశాల నుంచి వచ్చిన వారే. వీటితోపాటు 13 ఎసింప్టోమాటిక్(లక్షణాలు కనిపించని)​ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ తరహా కేసుల సంఖ్య 962కు చేరింది.

వైరస్​ వల్ల చైనాలో ఇప్పటివరకు 4,633మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 82వేల 880కి చేరింది. 481మంది ఇంకా ఆసుపత్రుల్లోనే ఉన్నారు.

ఇదీ చూడండి:-వైరస్​ తీవ్రతను చైనా అందుకే దాచిందా?

ABOUT THE AUTHOR

...view details