తెలంగాణ

telangana

ETV Bharat / international

సులేమానీ అంతిమయాత్రకు తరలి వచ్చిన వేలాదిమంది

అమెరికా బలగాల దాడిలో మృతి చెందిన ఇరాన్ టాప్ కమాండర్​ ఖాసిం సులేమానీ, ఇరాక్​ ఉన్నత స్థాయి కమాండర్ల అంత్యక్రియలు బాగ్దాద్​లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇరాక్​ ప్రధాని అదిల్​​ అబ్దుల్ మెహ్దీ సహా అక్కడి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Qasem Soleimani funerals
సులేమానీ అంత్యక్రియలకు తరలి వచ్చిన వేలాదిమంది

By

Published : Jan 4, 2020, 6:21 PM IST

బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా బలగాలు జరిపిన వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ టాప్ కమాండర్​ ఖాసిం సులేమానీ, సహా ఇతర ఉన్నత స్థాయి కమాండర్ల అంత్యక్రియలకు అక్కిడి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇరాక్ ప్రధాని అదిల్​ అబ్దుల్ మెహ్దీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

బాగ్దాద్​ కధిమియా జిల్లాకు ఇరాన్, ఇరాక్​ టాప్​కమాండర్ల శవపేటికలు తరలించారు. వీరి అంతిమయాత్రలో పాల్గొన్న వేలాది మంది ఇరాక్ మద్దతుదారులు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

శుక్రవారం వేకువజామున ఇరాక్‌ రాజధానిలోని బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా దళాలు దాడి చేసిన ఘటనలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌కు శక్తిమంతమైన కమాండర్​గా ఉన్న జనరల్‌ ఖాసిం సులేమానీ సహా ఇరాక్‌లో ఇరాన్‌ మద్దతున్న తిరుగుబాటు సంస్థ పాపులర్ మొబిలైజేషన్‌ ఫోర్సెస్‌ (పీఎంఎఫ్‌) డిప్యూటీ కమాండర్‌ అబు మహదీ అల్‌-ముహందిస్‌ మృతి చెందారు.

ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించగా.. పశ్చిమాసియాలో భారీ బలగాలను మోహరించింది అమెరికా. ఈ నేపథ్యంలో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

సులేమానీ అంత్యక్రియలకు తరలి వచ్చిన వేలాదిమంది

ఇదీ చూడండి: 'గల్ఫ్​లో మరోయుద్ధాన్ని ప్రపంచం భరించలేదు'

ABOUT THE AUTHOR

...view details