మొబైల్ ఫోన్లో గేమ్ ఆడుతూ.. తండ్రి డబ్బులు గుల్ల చేశాడు ఓ ఐదేళ్ల కుర్రాడు. క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా 1200 డాలర్లు(రూ. 91 వేలకుపైనే) పోగొట్టాడు.
వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన ఐదేళ్ల బాలుడు టెట్రిస్ అనే గేమ్ ఆడుతుండగా.. అది ఊబర్ ఈట్స్ అనే వెబ్‌సైట్‌కు వెళ్లింది. అంతే నోరూరించే ఐస్‌క్రీంలు అతడి కంట పడ్డాయి. వెంటనే ఆర్డర్ పెట్టేశాడు. ఆర్డర్ డెలివరీ అయినట్లుగా ఊబర్ ఈట్స్ నుంచి వచ్చిన మెసేజ్ చూసిన తండ్రి షాకయ్యాడు. అప్పటివరకు అతడికి ఇదేం తెలియదు.
ఆ పిల్లాడు.. ఫుడ్ డెలివరీ కోసం తండ్రి పనిచేసే ప్రదేశం అడ్రస్ ఇవ్వడం గమనార్హం. అప్పుడు బిల్లు చూసి ఆ తండ్రికి చచ్చినంత పనైంది. 1200 డాలర్ల ఖరీదు చేసే మెస్సినా ఫ్లేవర్ ఐస్‌క్రీంలు, 7 పెద్ద పెద్ద కేక్‌లు, బ్యాగ్‌ల నిండా తియ్యటి పదార్థాలు అందులో ఉన్నాయి.