తెలంగాణ

telangana

ETV Bharat / international

మళ్లీ జైలుకు వెళ్లనున్న నవాజ్​ షరీఫ్​

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్ నేడు మళ్లీ లాహోర్​లోని కోట్​లఖ్​పత్​ జైలుకు వెళ్లనున్నారు. అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న షరీఫ్​కు వైద్యచికిత్స కోసం కోర్టు 6వారాల మధ్యంతర బెయిల్​ను మార్చి 26న మంజూరు చేసింది. నేటితో ఆ గడువు ముగిసింది.

మళ్లీ జైలుకు వెళ్లనున్న నవాజ్​ షరీఫ్​

By

Published : May 7, 2019, 7:12 AM IST

మళ్లీ జైలుకు వెళ్లనున్న నవాజ్​ షరీఫ్​

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్ నేడు తిరిగి లాహోర్​లోని కోట్​ లఖ్​పత్​ జైలుకు వెళ్లనున్నారు. వైద్యం నిమిత్తం షరీఫ్​ పొందిన ఆరు వారాల మధ్యంతర బెయిల్​ గడువు నేటితో ముగియనుంది. ఆల్​ అజీజీయా మిల్స్ అవినీతి​ కేసులో నవాజ్​ షరీఫ్​కు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది డిసెంబర్​ 24 నుంచి ఆయన శిక్ష అనుభవిస్తున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న 69 ఏళ్ల షరీఫ్​కు వైద్య చికిత్స నిమిత్తం పాకిస్థాన్​ సుప్రీంకోర్టు మార్చి 26 నుంచి ఆరువారాల మధ్యంతర బెయిల్​ను మంజూరు చేసింది. అయితే వ్యాధి తీవ్రత దృష్ట్యా తనకు ఆకస్మిక మరణం సంభవించవచ్చునని, అందుకే శాశ్వత బెయిల్ మంజూరు చేయాలని షరీఫ్​ ఏప్రిల్​ 27న పిటిషన్​ దాఖలు చేశారు. చికిత్స కోసం బ్రిటన్​​ వెళ్లడానికి అనుమతి కోరుతూ రివ్యూ పిటిషన్ వేశారు. అయితే షరీఫ్​ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

మద్దతుగా కార్యకర్తలు

ఈ నేపథ్యంలో నేటితో​ బెయిల్ గడువు ముగుస్తున్న కారణంగా షరీఫ్ మరలా జైలుకు వెళ్లనున్నారు. అయితే జైలుకు వెళ్లే సమయంలో పాకిస్థాన్​ ముస్లిం లీగ్​ పార్టీ కార్యకర్తలు షరీఫ్​కు మద్దతుగా రోడ్లపైకి వస్తారని పార్టీ​ అధికార ప్రతినిధి ఔరంగజేబు తెలిపారు.

ఇదీ విషయం

నవాజ్​ షరీఫ్​ మూడుసార్లు పాక్​ ప్రధానిగా పనిచేశారు. మూడు అవినీతి కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. పనామా పేపర్లలో వెలుగు చూసిన కేసులో ఆయనకు 7 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఫలితంగా ఆయన 2018 డిసెంబర్​ 24 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మొదట షరీఫ్​ను అడియాలా జైలులో ఉంచారు. తదనంతరం ఆయన విజ్ఞాపనతో కోట్​ లఖ్​పత్​ జైలుకు మార్చారు.

ఇదీ చూడండి: బ్రిటన్​ యువరాజు నివాసంలో బుడిబుడి అడుగులు

ABOUT THE AUTHOR

...view details