తెలంగాణ

telangana

ETV Bharat / international

పీఓకేలో... కశ్మీర్​పై ఇమ్రాన్​ఖాన్ 'విధాన ప్రకటన' - పీఓకే

పీఓకేలో శుక్రవారం నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ కశ్మీర్​పై 'విధాన ప్రకటన' చేస్తారని పాకిస్థాన్ ప్రకటించింది. కశ్మీర్​ సమస్య పరిష్కారానికి మూడో పార్టీ మధ్వవర్తిత్వం కూడా తమకు అంగీకారమేనని స్పష్టం చేసింది.

పీఓకేలో... కశ్మీర్​పై ఇమ్రాన్​ఖాన్ 'విధాన ప్రకటన'

By

Published : Sep 12, 2019, 3:48 PM IST

Updated : Sep 30, 2019, 8:39 AM IST

ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ శుక్రవారం 'కశ్మీర్'​పై​ 'విధాన ప్రకటన' చేస్తారని పాకిస్థాన్ వెల్లడించింది. పీఓకే రాజధాని ముజాఫరాబాద్​లో నిర్వహించే ఓ బహిరంగసభలో ఈ మేరకు ప్రకటన చేస్తారని స్పష్టం చేసింది.

మధ్యవర్తిత్వం మాకు ఓకే

"కశ్మీర్ సమస్య విషయంలో మూడవ పార్టీ మధ్యవర్తిత్వానికి భారత్​ సిద్ధంగా లేదు. కానీ పాక్​ దీనికి సిద్ధంగా ఉంది. చర్చల ద్వారానే కశ్మీర్​ సమస్య పరిష్కారమవుతుందని పాక్ భావిస్తోంది."- మొహమ్మద్​ ఫైసల్​, పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

కశ్మీర్​పై అంతర్జాతీయ న్యాయసూత్రాలు ఆధారంగానే పాక్ నడుచుకుంటుందని ఫైసల్​ పేర్కొన్నారు. అయితే తమ పోరాటం కొనసాగుతునే ఉంటుందని పేర్కొన్నారు.

ఆందోళన కలిగించే అంశం

కశ్మీర్​పై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి అధ్యక్షుడు చేసిన ప్రకటనను ఫైసల్​ ప్రస్తావించారు. ఈ ప్రకటన కశ్మీర్​పై అంతర్జాతీయ సమాజంలో పెరుగుతున్న ఆందోళనను చూపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఇది మా అంతర్గత విషయం..

కశ్మీర్... భారత అంతర్గత విషయమని భారత్​ ఇప్పటికే అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేసింది. పాక్ ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకు శాంతి చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

ఆర్టికల్​ 370 రద్దు తరువాత కశ్మీర్​ విషయంలో భారత్​-పాక్​ల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఇదీ చూడండి: ఈడీ ముందుకు ఐశ్వర్య- పన్ను ఎగవేతపై ప్రశ్నల వర్షం

Last Updated : Sep 30, 2019, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details