తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వచ్చినా మా దేశస్థులు చైనాలోనే ఉంటారు: పాక్​

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్​ కారణంగా చైనాలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 213కు చేరింది. ప్రస్తుతం 9,692 మందికి ఈ వైరస్​ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనాలో ఉన్న తమదేశ పౌరులను స్వస్థలాలకు తిరిగి రప్పించేందుకు భారత్​ సహా మిగతా దేశాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. అయితే పాకిస్థాన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. చైనాకు సంఘీభావం తెలిపేందుకు తమ పౌరులను తిరిగిరప్పించబోమని ప్రకటించింది.

pak-not-to-evacuate-its-citizens-from-virus-hit-wuhan-to-show-solidarity
కరోనా వచ్చినా మా దేశస్థులు చైనాలోనే ఉంటారు: పాక్​

By

Published : Jan 31, 2020, 10:11 AM IST

Updated : Feb 28, 2020, 3:21 PM IST

కరోనా.. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోన్న భయంకర వైరస్​. డ్రాగన్​ దేశంలో ఈ వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్​ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 213కు చేరింది. తాజాగా మరింత మందికి ఈ వైరస్​ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వైరస్​ బారిన పడినవారి సంఖ్య 9,692కు చేరినట్లు వెల్లడించారు.

పాక్​ వింత వైఖరి..

కరోనా భయంతో ప్రపంచ దేశాలన్నీ డ్రాగన్​ దేశంలోని తమ దేశస్థులు, విద్యార్థులను తిరిగి రప్పించేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ పాకిస్థాన్​ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. వూహాన్​లో ఉంటున్న పాకిస్థానీలు ఎవరు ఖాళీ చేయనవసరం లేదని తెలిపింది. తమ మిత్ర దేశానికి సంఘీభావం తెలపటం కోసం ఈ నిర్ణయం తీసుకుంది ఇమ్రాన్ సర్కార్​. ప్రస్తుతం చైనాలో 800 మంది పాక్​ విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే నలుగురు పాక్​ దేశస్థులు కరోనా​ బారిన పడ్డారు.

హుబే రాష్ట్రంలోనే 204 మంది..

చైనాలోని హుబే రాష్ట్రంలోనే మొత్తం 5,806 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 204 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్​తో కలిపి 20 దేశాల్లో కరోనా కేసులు నమోదైనట్లు ప్రకటించాయి.

ఇదిలా ఉండగా చైనాలోని భారతీయులకు తీసుకొచ్చేందుకు ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు దిల్లీ నుంచి ఎయిర్​ ఇండియా ప్రత్యేక విమానం వెళ్లనుంది.

అత్యవసర పరిస్థితి విధింపు..

కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) సమావేశమైంది. అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. బలహీనమైన ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలకు కరోనా వైరస్ వ్యాపించే అవకాశముందని... ఈ విషయం ఆందోళన కలిగిస్తున్నందున అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించామని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ టెడ్రోస్ అధనామ్​ ఘెబ్రేయేసస్​ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'జైలుకు వెళ్లకపోతే.. రాజకీయ నాయకుడివి ఎలా అవుతావు'

Last Updated : Feb 28, 2020, 3:21 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details