తెలంగాణ

telangana

ETV Bharat / international

'బర్త్​డే విషెస్​​ చెప్పినంత మాత్రాన చర్చలు జరగవు' - trump birthday wishes to kim

ఉత్తరకొరియా అధినేత కిమ్​ జాంగ్ ఉన్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అయితే బర్త్​ డే విషెస్​ చెప్పినంత మాత్రాన అమెరికాతో అణు చర్చలు పునరిద్దరిస్తామనుకోవడం పొరపాటేనని స్పష్టం చేసింది ఉత్తర కొరియా. అన్ని డిమాండ్లను అంగీకరిస్తేనే కొనసాగిస్తామని వెల్లడించింది.

Trump's birthday greet not enough to resume talks
'బర్త్​డే విషెష్​ చెప్పినంత మాత్రన చర్చలు జరగవు'

By

Published : Jan 11, 2020, 8:44 PM IST

Updated : Jan 11, 2020, 10:49 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ నుంచి తమ అధినేత కిమ్​ జాంగ్​ ఉన్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలతో లేఖ అందినట్లు ఉత్తరకొరియా ప్రకటించింది. అగ్రరాజ్యంతో అణు చర్చలు పునరిద్ధరించాలంటే మాత్రం తమ డిమాండ్లకు ఒప్పకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ట్రంప్​-కిమ్ మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగానే ఉన్నయని.. అయితే బర్త్​డే విషెస్​​ చెప్పి అణు చర్చలు జరపాలనుకుంటే మాత్రం పొరపాటేనని స్పష్టం చేసింది.

జనవరి 8న కిమ్ పుట్టినరోజున అమెరికా నుంచి లేఖ వచ్చినట్లు ఉత్తరకొరియా విదేశాంగ సలహాదారు కిమ్​కై గ్వాన్​ వెల్లడించారు. తమ డిమాండ్లకు అమెరికా ఒప్పుకునే అవకాశమే లేనందున అణు చర్చల పునరుద్ధరణ సాధ్యమయ్యే అవకాశాలే లేవని స్పష్టం చేశారు.

2018 జూన్ నుంచి ట్రంప్-కిమ్​ మధ్య అణునిరాయుధీకరణ అంశంపై మూడు సార్లు జరిగిన చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. గతేడాది ఫిబ్రవరిలో హనోయ్​లో జరాగాల్సిన సమావేశం రద్దయింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య భేటీకి సయోధ్య కుదరడం లేదు.

కిమ్​తో తనకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని హనోయ్​లో అర్థాంతరంగా రద్దయిన భేటీకి ముందు తెలిపారు ట్రంప్​. తాము ప్రేమలో పడిపోయినట్లు చెప్పారు.

గతేడాది డిసెంబరులో జరిగిన పార్టీ సమావేశంలో అణు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను ఉత్తరకొరియా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు కిమ్. ఈ నిర్ణయం అమెరికా-ఉత్తరకొరియా మధ్య రెండేళ్లుగా జరుగుతున్న అణు చర్చల పురోగతికి కేంద్రమని నిపుణులు భావించారు.

ఇదీ చూడండి: మోదీతో దీదీ భేటీ.. పౌర చట్టం ఉపసంహరణకు విజ్ఞప్తి

Last Updated : Jan 11, 2020, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details