కరోనా సోకే విషయంలో పురుషులు, మహిళలకు సమానంగా అవకాశాలు ఉన్నప్పటికీ.. తీవ్రంగా ప్రభావితం అవటం, మరణించడంలో పురుషులే అగ్రస్థానంలో ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. వయస్సు పైబడిన వారిలో మధుమేహం, అధిక రక్త పోటు వంటివి ఉంటే మరణాలు సంభవించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
కరోనా మరణాలపై అధ్యయనం చేశారు చైనాలోని బీజింగ్ టాంగ్రెన్ ఆస్పత్రికి చెందిన జిన్ కువాయ్ యాంగ్ అనే శాస్త్రవేత్త, ఆయన బృందం. సొంతంగా వైద్యం చేసుకుంటున్న 43 మంది వైద్యులు, 1056 మంది కరోనా రోగుల పరిస్థితిని పరిశీలించారు. వారి పరిశోధనకు సంబంధించిన నివేదిక 'ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్' జర్నల్లో ప్రచురితమైంది.
కరోనా కారణంగా మరణిస్తున్న వారిలో మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు జనవరిలోనే గుర్తించాం. ఇది పురుషులు కొవిడ్-19 బారిన పడడానికి, చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందా? అనే ప్రశ్నను లేవనెత్తింది. కరోనా మరణాల్లో లింగ భేదం ఉన్నట్లు ఎవరూ గుర్తించలేదని మేము కనుగొన్నాము. అందువల్ల దర్యాప్తు ప్రారంభించాం.
-జిన్ కువాయ్ యాంగ్, శాస్త్రవేత్త, టాంగ్రెన్ ఆస్పత్రి