హాంగ్‌కాంగ్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. బీజింగ్ మద్దతుదారులకు, ఆందోళనకారులు మధ్య ఆదివారం తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. నిరసనకారులు నార్త్ పాయింట్ ఫోర్ట్రెస్ హిల్ వద్దకు ర్యాలీగా వస్తున్న సమయంలో బీజింగ్ అనుకూల వర్గీయులు ఎదురయ్యారు. ఇరు వర్గాల వారు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ గొడవల్లో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు.
ప్రభుత్వ స్పందన