తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా చెంపపై చాచి కొట్టాం: ఇరాన్ అధినేత ఖమేనీ

అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు నిర్వహించడంపై ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ స్పందించారు. తాము తీసుకున్న చర్యలు సులేమానిని హత్యచేసిన అమెరికాకు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ఇరాన్​లో అమెరికా ఉనికి లేకుండా చేయడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు.

Iran supreme leader says 'slap in face' delivered to US
అమెరికా చెంపపై చాచి కొట్టాం: ఇరాన్ అధినేత ఖమేనీ

By

Published : Jan 8, 2020, 2:50 PM IST

అమెరికా సైనిక స్థావరాలపై తాము పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసి... జనరల్​ సులేమానిని హత్య చేసిన అమెరికాను చెంపదెబ్బ కొట్టామని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ఇరాన్​లో అమెరికా ఉనికిని అంతం చేయడమే తమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశ అధికారిక టీవీ ఛానల్​ లైవ్​లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పగ తీర్చుకుంటాం..

ఇరాన్ 'కుర్ద్​ఫోర్స్' అధిపతి జనరల్​ సులేమానిని ఇరాక్​లోని బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా హతమార్చింది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత.. ఇరాన్​లోని అమెరికా సైనిక స్థావరాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేయించారు. ఈ దాడిలో సుమారు 80 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:అమెరికాతో భారత్​ రాయబారానికి ఇరాన్​ సై

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details