ETV Bharat / international

అమెరికాతో భారత్​ రాయబారానికి ఇరాన్​ సై - భారత్... అమెరికా-ఇరాన్‌ మధ్య ఉన్న ఉద్రిక్తతలను

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​ ముందుకు వస్తే.. స్వాగతిస్తామని దిల్లీలో ఉండే ఇరాన్​ రాయబారి అలీ చెగేని తెలిపారు.

iran
ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్​ రాయబారాన్ని స్వాగతిస్తాం-ఇరాన్​
author img

By

Published : Jan 8, 2020, 2:26 PM IST

అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గించడం కోసం భారత్‌ చేసే ఎలాంటి శాంతి ప్రక్రియనైనా ఇరాన్‌ స్వాగతిస్తుందని భారత్‌లో ఇరాన్ రాయబారి అలీ చెగేని తెలిపారు. ఇరాన్ తన అగ్ర కమాండర్ జనరల్ సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసిన కొన్ని గంటల తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతికాముక దేశమైన భారత్...ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని చెప్పారు. పశ్చిమాసియాలో ఇరాన్‌ శాంతిని తప్ప యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడిపై స్పందించిన అలీ.... తమను తాము రక్షించుకునే క్రమంలో ప్రతీకారం తీర్చుకునే హక్కు ఇరాన్‌కు ఉందని ఉద్ఘాటించారు.

విదేశాంగ మంత్రుల మంతనాలు...

యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్‌, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోతో సంభాషించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై భారత్ ఆందోళనలను వివరించారు.

ఇదీ చూడండి : ఇరాన్​ విమాన ప్రమాదంలో 176 మంది దుర్మరణం

SNTV Digital Daily Planning, 0800 GMT
Wednesday 8th January 2020
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Preview ahead of Spanish Super Cup semi-final, Barcelona v Atletico Madrid, from Jeddah, Saudi Arabia. Expect at 1830.
SOCCER: Manager reactions following Leicester City v Aston Villa, Carabao Cup semi-final first leg. Expect at 2300.
SOCCER: AFC Under-23 Championship, Iraq v Australia. Expect at 1300.
SOCCER: AFC Under-23 Championship, Thailand v Bahrain. Expect at 1600.
TENNIS: Highlights from the inaugural ATP Cup in Brisbane, Perth and Sydney, Australia. Updates throughout the day.
TENNIS: Highlights from the WTA, Brisbane International in Brisbane, Australia. Already moved.
MOTORSPORT: Day four highlights from the Dakar Rally, taking place in Saudi Arabia. Expect at 1500.
WINTER SPORT: FIS Alpine Skiing World Cup, men's slalom from Madonna di Campiglio, Italy. Expect first run at 1900, with second race at 2100.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.