ETV Bharat / international

ఇరాన్​ విమాన ప్రమాదంలో 176 మంది దుర్మరణం - ukrainian plane crashes in iran

ఇరాన్ నైరుతి ప్రాంతంలో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానంలోని 176 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడిన గంటల వ్యవధిలోనే ఈ విమాన ప్రమాదం జరగడం గమనార్హం. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Iranian official: All on board Ukrainian plane killed
ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో 176 మంది దుర్మరణం
author img

By

Published : Jan 8, 2020, 12:02 PM IST

Updated : Jan 8, 2020, 3:45 PM IST

ఇరాన్​ విమాన ప్రమాదంలో 176 మంది దుర్మరణం

ఇరాన్​లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 176 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు.

ఉక్రెయిన్​కు చెందిన 737-800 విమానం ఇరాన్​లోని ఖొమేని విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే కూలిపోయింది. సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

"ఇమామ్​ ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఉక్రెయిన్ విమానం.. పరాంద్​, షహర్యార్​ల మధ్య కుప్పకూలింది. ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాన్ని పంపించాం." - రెజా జాఫర్జే, ఇరాన్ పౌరవిమానయాన సంస్థ అధికార ప్రతినిధి

మృతుల కోసం

విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇరాన్​ అత్యవసర విభాగం అధికారి పిర్​ హుస్సేన్ కులివాంద్ తెలిపారు.

ప్రయాణికుల సంఖ్య?

ఇరాన్​ ప్రభుత్వం 167 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది మరణించారని ప్రకటించింది. అయితే అధికారిక టీవీ ఛానెల్ మాత్రం అంతకు ముందు 180 మంది ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటన తరువాత కూడా ఈ సంఖ్యను వెంటనే మార్చకపోవడం గమనార్హం.

ఫ్లైట్​ డేటా ఏం చెబుతోంది?

ఉక్రెయిన్​కు చెందిన 737-800 విమానం ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం బయలుదేరింది. ఆపై వెంటనే డేటాను పంపడం ఆగిపోయిందని ఫ్లైట్​ రాడార్ 24 అనే వెబ్​సైట్​ పేర్కొంది. అయితే దీనిపై విమానయాన సంస్థ స్పందించలేదు.

గంటల వ్యవధిలో..!

తమ అత్యున్నత సైనిక​ జనరల్ సులేమానిని అమెరికా హతమార్చిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకారంగా దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రయాణికుల విమానం ప్రమాదానికి గురికావడం గమనార్హం.

ఇదీ చూడండి: దేశవ్యాప్త బంద్​: బంగాల్​లో నిరసనలు ఉద్ధృతం

AP Video Delivery Log - 0500 GMT News
Wednesday, 8 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0444: Japan Iraq Reax Part No Access Japan; Cleared for digital and online use, Except by Japanese media, NBC, CNBC, BBC, and CNN. Must credit 'TV TOKYO' if images are to be shown on cable or satellite in Japan. No client archiving or reuse. No AP Reuse. Part No Access Japan/No Archive 4248178
Japan urges diplomacy after Iraq attacks
AP-APTN-0420: Iran Plane Crash No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4248177
Iran state TV: Ukrainian plane crashes near Tehran
AP-APTN-0404: Australia PM Iraq No access Australia 4248176
Australian PM on Iranian attacks in Iraq
AP-APTN-0359: Iran Soleimani Burial 3 No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4248175
Iran buries Soleimani as it attacks Iraqi bases
AP-APTN-0358: Australia Survival AP Clients Only 4248174
Couple vow to return after losing home in NSW fire
AP-APTN-0349: China Markets AP Clients Only 4248173
Asian stocks tumble after Iran missile attack
AP-APTN-0332: Iraq Attack UGC AP Clients Only 4248169
Video purports to show Iranian attack on Iraqi base
AP-APTN-0321: Internet Iraq Attack Tweets AP Clients Only 4248171
Trump tweets 'All is well!' after missile attack
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 8, 2020, 3:45 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.