యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని.. విధ్వంసాలకు, దుశ్యర్చలకు తాము ఇచ్చే సమధానం అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని అభివర్ణించారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన శత్రు దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు.
"మీరు చర్చలు జరుగుతున్నప్పుడు మా చేతుల్ని ఖాళీ చేయాలని ప్రయత్నించారు. కానీ, మా చేతులు నిండుగా ఉన్నాయి. యురేనియం సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచడం.. మీ దుశ్చర్యలకు మేము ఇచ్చే సమాధానం. ఐఆర్-6 సెంట్రిఫ్యూజు, యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచడం ద్వారా మీ చేతుల్ని మేం తొలగించగలం."
-హసన్ రౌహాని, ఇరాన్ అధ్యక్షుడు