సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగాభారత్-పాక్తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. ఇరు దేశాల సైన్యాల డైరెక్టర్ జనరళ్ల చర్చల అనంతరం.. గురువారం అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి తప్పకుండా కట్టుబడి ఉండాలన్న భారత్-పాక్ నిర్ణయంపై ఇమ్రాన్ ఖాన్ మొదటిసారి స్పందించారు. రెండేళ్ల క్రితం పాకిస్థాన్ బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దాడిని గుర్తు చేస్తూ ట్వీట్ చేసిన ఆయన.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధమని వివరించారు.
"నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొల్పే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఐరాస భద్రతామండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ ప్రజల దీర్ఘకాల డిమాండ్ స్వయం నిర్ణయాధికార కల్పనకు భారత్ అవసరమైన చర్యలు తీసుకోవాలి."
-ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని.