తెలంగాణ

telangana

ETV Bharat / international

మా యాప్​లు ఎలా నిషేధిస్తారు: చైనా

59 చైనా యాప్​లపై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చైనా మండిపడింది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను కాలరాయడమేనని వ్యాఖ్యానించింది. చైనా సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలా భారత ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అక్కసు వెళ్లగక్కింది.

By

Published : Jan 27, 2021, 9:02 PM IST

India's move to continue with ban on 59 Chinese apps violation of WTO principles: China
ఆ యాప్‌లను ఎలా నిషేధిస్తారు.. చైనా చిందులు

టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయంపై చైనా ఆక్రోశం వ్యక్తంచేసింది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఈ చర్యలు చైనా సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని చిందులు తొక్కుతోంది.

గతేడాది ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో చైనా దురాక్రమణకు కళ్లెం వేసేందుకు భారత్‌ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌ సహా అనేక యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో జారీ చేసిన నోటీసులపై ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై ఇటీవల నిషేధాన్ని కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈ అంశంపై దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి జీ రోంగ్‌ స్పందించారు. జాతీయ భద్రతను సాకుగా చూపుతూ గతేడాది భారత్‌ పదే పదే చైనాకు చెందిన పలు మొబైల్‌ యాప్‌లను నిషేధించిందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు, మార్కెట్‌ సూత్రాలను ఉల్లంఘించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. వివక్షతో కూడిన ఈ చర్యలను భారత్‌ సరిచేసుకోవాలని, తద్వారా ద్వైపాక్షిక సహకారానికి ముందుముందు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరుతున్నట్టు చెప్పారు.

ఇదీ చూడండి:చైనాకు మళ్లీ ఝలక్​.. పబ్​జీ సహా 280 యాప్​లపై నిషేధం!

ABOUT THE AUTHOR

...view details