తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంగ్​కాంగ్​లో తారస్థాయికి నిరసనలు - చైనా బిల్లు

చైనా బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​లో నిరసనలు తారస్థాయికి చేరాయి. తాజాగా ఓ పోలీస్​ స్టేషన్​పై దాడికి దిగిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు.

హాంగ్​కాంగ్​ నిరసనకారులపై భాష్పవాయువు ప్రయోగం

By

Published : Aug 4, 2019, 5:45 AM IST

Updated : Aug 4, 2019, 7:31 AM IST

హాంగ్​కాంగ్​ నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగం

హాంగ్​కాంగ్​లో నిరసన జ్వాలలు తారస్థాయికి చేరుకున్నాయి. 'సిమ్​ సా సుయ్​' పోలీస్​ స్టేషన్ పరిధిలో కొంతమంది నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. పోలీస్​ స్టేషన్​పైకి ఇటుకలతో దాడికి దిగారు. గోడలపై ఆగ్రహపూరిత వాఖ్యలు రాశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసులకు మద్దతు

కొంత మంది తెలుపు రంగు దుస్తులు ధరించి హాంగ్​కాంగ్ పార్కు వద్దకు చేరి పోలీసులకు మద్దతు ప్రకటించారు. దేశంలో నెలకొన్న హింసకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. హాంగ్​ కాంగ్​, చైనా జాతీయ పతాకాలను ప్రదర్శించారు.

ఇదీ చూడండి: 'దారికి రాకపోతే అంతే'... చైనాకు ట్రంప్​ హెచ్చరిక

Last Updated : Aug 4, 2019, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details