తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కల్లోలం​: చైనాలో 361కి చేరిన మృతుల సంఖ్య

చైనాలో కరోనా మహమ్మారి ధాటికి మరో 57 మంది బలయ్యారు. ఈ వైరస్​ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 361కి చేరింది. కరోనా మృతుల సంఖ్య... డ్రాగన్​ దేశంలో గతంలో వ్యాపించిన 'సార్స్​' వైరస్​ మరణాలను మించిపోయింది.

china-virus-toll-rises-to-360-with-56-new-fatalities-govt
కరోనా ఎఫెక్ట్​: చైనాలో 360 మృతి... 'సార్స్​'కంటే ఇదే అధికం

By

Published : Feb 3, 2020, 5:32 AM IST

Updated : Feb 28, 2020, 11:13 PM IST

చైనాలో కరోనా వైరస్​ మరణాల సంఖ్య 361కి చేరింది. ఇది 2002-03లో చైనాలో వ్యాపించిన 'సార్స్​' వైరస్​ మృతులను మించిపోయింది. నిన్న ఉదయానికి 304 మంది ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 57 మంది బలయ్యారని చైనా అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ వైరస్​ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజు కొత్తగా 2,829 మందికి ఈ వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 17, 205 మందికి ఇప్పటివరకు ఈ వైరస్​ సోకింది. మారుతున్న గణాంకాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం వెల్లడిస్తోంది.

ఇదీ చదవండి: దిల్లీ జామియా వర్సిటీలో మళ్లీ కాల్పుల కలకలం

Last Updated : Feb 28, 2020, 11:13 PM IST

ABOUT THE AUTHOR

...view details