కొత్తరకం వైరస్ కరోనా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా 18 మంది మృతి చెందారు. 630 కేసులకు పైగా నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వుహాన్ సహా మరో నాలుగు నగరాల రాకపోకలను నిషేధించింది చైనా ప్రభుత్వం. ప్రజారవాణా, రైలు, విమాన సర్వీసులను నిలిపివేసింది.
చైనాలోని 25 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 631 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల సగటు వయసు 73గా అధికారులు తెలిపారు.
వుహాన్ నగరానికి వెళ్లిన వారికే ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు తొలుత భావించారు. అయితే తాజాగా ఆ నగరానికి ప్రయాణించని వారికి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలిసింది.