చైనాలో తాజాగా మరో 30 వైరస్ కేసులు నమోదయినట్లు వెల్లడించింది అక్కడి ఆరోగ్య శాఖ. ఇందులో ఐదు కేసులు స్థానికంగా వ్యాప్తి చెందినట్లు పేర్కొన్నారు అధికారులు. మిగతావారు విదేశాల నుంచి వచ్చినట్లు చెప్పారు. వైరస్ కేంద్రస్థానమైన హుబేలో కరోనా కారణంగా శనివారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ మరణాలతో కలిపి చైనాలో మృతుల సంఖ్య 3329కి చేరింది. ఇప్పటివరకు 81, 669 కరోనా కేసులు నమోదయ్యాయి. 1376 మంది వైరస్‌కు చికిత్స పొందుతున్నారు. 76, 964మందికి వైరస్ నయమైంది.
దొంగ వైరస్ కేసుల్లో పెరుగుదల..
కరోనా లక్షణాలు లేకుండా దాడిచేసే దొంగ వైరస్ మరో 47 మందికి సోకినట్లు సమాచారం. ఇప్పటికే ఇలా వైరస్ లక్షణాలు లేని 1024 మందిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వుహాన్‌కు తగ్గిన ముప్పు..