పసిపిల్లలను నిద్రబుచ్చాలంటే తల్లిదండ్రులు నానా తంటాలు పడాల్సిందే. కాసేపు పడుకుందామంటే కేర్..మంటారు. వాళ్లు కునుకు తీసే వరకు జోలపాడుతూ మేల్కొని ఉండాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాడు చైనాకు చెందిన ఓ వ్యక్తి. పిల్లవాడు నిద్రపోయిన తర్వాత తన కనురెప్పలపై తెరిచి ఉన్న కళ్ల రూపంలో బొమ్మను గీసుకుని కాసేపు కునుకు తీశాడు.
కనురెప్పలపై కనికట్టు - baby
పిల్లలను హాయిగా బజ్జోపెట్టడానికి ఓ చైనీయుడు కొత్త కనికట్టు కనిపెట్టాడు. తన బుడుతడిని హాయిగా నిద్రబుచ్చుతోన్న ఈ వీడియోకి సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది.
కంటిపై బొమ్మ
ఒకవేళ బుడతడు నిద్రలేచినా రెప్పలపై ఉన్న కంటి బొమ్మను చూసి తండ్రి మేల్కొనే ఉన్నాడనే భ్రమలో పడి నిద్రలోకి జారుకుంటాడు. అంతేకాదు పిల్లవాడికి మెలకువ రాకుండా తాను స్వయంగా ఆలపించిన జోలపాటను ఫోన్లో రికార్డు చేసి మరీ కునుకు తీశాడు. ఈ ప్రణాళిక విజయవంతమై ప్రశాంతంగా పడుకున్నాడు బుడతడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోకి విశేష స్పందన వస్తోంది. మొత్తానికి ఈ ప్లాన్‌తో నెటిజన్ల మనసు దోచుకున్నాడు.