తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: వన్యప్రాణుల విక్రయాలపై చైనాలో నిషేధం

పాములు, గబ్బిలాలు సహా ఇతర వన్యప్రాణుల విక్రయాలపై తాత్కాలిక నిషేధిం విధించింది చైనా ప్రభుత్వం. కరోనా వైరస్​ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచే అమల్లోకి వచ్చిన ఈ ఆంక్షలు వైరస్​ తగ్గుముఖం పట్టే వరకూ కొనసాగుతాయి.

China imposes Ban on Forest Animals selling including Snakes
కరోనా ఎఫెక్ట్​: వన్యప్రాణుల విక్రయాలపై చైనాలో నిషేధం

By

Published : Jan 27, 2020, 5:55 AM IST

Updated : Feb 28, 2020, 2:34 AM IST

కరోనా ఎఫెక్ట్​: వన్యప్రాణుల విక్రయాలపై చైనాలో నిషేధం

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వన్యప్రాణుల విక్రయాలపై చైనా తాత్కాలిక నిషేధం విధించింది. తాచుపాములు, గబ్బిలాల వల్లే ప్రాణాంతక కరోనా వైరస్ ప్రబలుతున్నట్లు తేలగా.. ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చైనా వ్యవసాయ శాఖ, మార్కెట్ నియంత్రణా సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది.

ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి చైనాలో 56 మంది మృతిచెందగా 2వేల మందికిపైగా అనారోగ్యానికి గురయ్యారు. అక్కడి సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, హోటల్స్ లో పాములు, కప్పలు, మొసళ్లు సహా ఇతర వన్యప్రాణులను అమ్ముతుంటారు. వాటివల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధరణ అయినందున వాటి విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ చైనా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆంక్షలు... వైరస్ తగ్గేవరకూ కొనసాగుతాయని ప్రకటించింది.

ఇదీ చూడండి : బ్రెగ్జిట్​ స్మారక చిహ్నంగా నూతన 'నాణెం' విడుదల

Last Updated : Feb 28, 2020, 2:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details