మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్సులో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పర్యటక బస్సుకు నిప్పంటుకుని 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు డ్రైవర్లు, నలుగురు సిబ్బందితో పాటు 53 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రమాదానికి గల కారణాలపై ప్రశ్నిస్తున్నారు.
చైనాలో 26మంది పర్యటకులు సజీవ దహనం - province
మధ్యచైనాలోని హునాన్ రాష్ట్రంలో ఓ పర్యటక బస్సుకు నిప్పంటుకుని 26మంది మృతి చెందారు. మరో 28మందికి తీవ్రగాయాలయ్యాయి.
చైనాలో కాలిపోయిన బస్సు
ఇదీ చూడండి:64కు చేరిన చైనా రసాయన పేలుడు మృతులు