భారత్లో ఉన్న తమ పౌరుల్ని స్వదేశానికి తరలించడానికి ఆస్ట్రేలియా విమాన సర్వీసుల్ని శుక్రవారం తిరిగి ప్రారంభించింది. దిల్లీలోని ఆస్ట్రేలియన్లను తీసుకెళ్లడానికి సిడ్నీ నుంచి విమానం బయలుదేరిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మరైజ్ పెయిన్ తెలిపారు.
'క్వారంటైన్లో ఉండాల్సిందే'
ఆ విమానంలోనే భారత్కు ఆక్సిజన్ సిలిండర్లను పంపించామని మరైజ్ పెయిన్ తెలిపారు. ఆస్ట్రేలియాకు వచ్చాక ప్రయాణికులు కఠినమైన క్వారంటైన్ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. భారత్లో వ్యాపిస్తున్న కరోనా వారి వల్ల ఆస్ట్రేలియాలోనూ వ్యాపించకూడదనే క్వారంటైన్ నిబంధన పెట్టినట్లు పేర్కొన్నారు.
గతంలో నిషేధం
భారత్ నుంచి వస్తే జైలు శిక్షతో పాటు, 66వేల ఆస్ట్రేలియన్ డాలర్ల శిక్ష విధిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. విమాన ప్రయాణాల్ని నిలిపివేసింది. కాగా ఇన్ని రోజుల తర్వాత మళ్లీ విమాన సర్వీసుల్ని భారత్కు నడపడం ఇదే మొదటి సారి. కొద్ది రోజులు విమాన సర్వీసుల్ని నిలిపివేయడం వల్ల కరోనా తీవ్రంగా వ్యాపించకుండా అడ్డుకట్టవేయగలిగామని మరైజ్ పెయిన్ అన్నారు.