తాలిబన్లపై అఫ్గానిస్థాన్ భద్రతాదళాలు జరిపిన వైమానిక దాడిలో దాదాపు 20 మంది తాలిబన్లు హతమయ్యారు. మృతుల్లో కొందరు పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం. హెల్మాంద్ రాష్ట్రం నహ్ సరజ్ జిల్లాలోని ఆర్మీ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన తాలిబన్లు.. ఆయుధాలు, సామాగ్రిని దొంగిలిస్తుండగా వైమానిక దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
అఫ్గాన్ బలగాల దాడుల్లో 20 మంది తాలిబన్లు హతం! - తాలిబన్లు
అఫ్గానిస్థాన్ హెల్మాంద్ రాష్ట్రంలో భద్రతాదళాలు జరిపిన దాడుల్లో 20 మంది తాలిబన్లు హతమయ్యారు. ఆర్మీ క్యాపు కార్యాలయం నుంచి ఆయుధాలు, సామాగ్రిని దొంగిలిస్తుండగా వైమానిక దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
తాలిబన్లు
మరోవైపు వైమానిక దాడిలో మరణించిన వారందరూ పౌరులేనని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ ఆరోపించారు.
ఇదీ చదవండి :చైనాలో రైలు ఢీకొని 9మంది మృతి