తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో కరోనా విలయతాండవం.. 132కి చేరిన మృతులు

25 new fatalities in China's virus epicentre: official
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మృతులు

By

Published : Jan 29, 2020, 6:02 AM IST

Updated : Feb 28, 2020, 8:44 AM IST

06:26 January 29

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మృతులు

చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్​తో రోజురోజుకు మృత్యుఘోష పెరుగుతూ పోతోంది.​ ఈ వైరస్​ బారిన పడి తాజాగా మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా డ్రాగన్​ దేశంలో కరోనా మృతుల సంఖ్య 132కి చేరింది. ఇప్పటికే 4,515 మంది చికిత్స పొందుతుండగా కొత్తగా మరో 1,500 కేసులను గుర్తించినట్లు చైనా ఆరోగ్య శాఖ​ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డ్రాగన్​లో ఈ వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 6వేలు దాటింది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మృతులు

చైనాతో పాటు ప్రపంచ దేశాలను సైతం కరోనా వణికిస్తోంది. థాయ్​లాండ్​(7), జపాన్​(3), దక్షిణకొరియా(3), అమెరికా(3), వియత్నాం(2), సింగపూర్​(4), మలేసియా(3), ఆస్ట్రేలియా(4), ఫ్రాన్స్​(4), నేపాల్, శ్రీలంకలో ఒకరు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.​
 

06:01 January 29

చైనాలో కరోనా విలయతాండవం.. 132కి చేరిన మృతులు

ప్రాణాంతక కరోనా వైరస్​తో చైనాలో మరో 25 మంది మరణించారు. ఫలితంగా డ్రాగన్​ దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 132కి చేరింది. మరో 840 మందికి ఈ వైరస్​ సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Last Updated : Feb 28, 2020, 8:44 AM IST

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details