తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడ్డారని గుజరాత్ కచ్ జిల్లాలోని జఖావ్ తీరం సమీపంలో భారత జాలర్లను అదుపులోకి తీసుకుంది పాకిస్థాన్. 4 పడవలను స్వాధీనం చేసుకున్న పొరుగుదేశం అధికారులు.. 23 మంది జాలర్లను అరెస్టు చేశారు.
చేపల వేటకు వెళ్లిన ఇరుదేశాల జాలర్లును పాక్-భారత్ తీరప్రాంత భద్రతాధికారులు అరెస్టు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. ఇలా రెండు దేశాలకు చెందిన వేలాది మత్స్యకారులు పొరుగు దేశాల జైళ్లలో మగ్గుతున్నారు.