అఫ్ఘానిస్థాన్ అధ్యక్ష భవనంలోని 20 మంది సిబ్బందికి కరోనా సోకింది. అయితే ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి మాత్రం వైరస్ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. 20 మంది కొవిడ్ బారిన పడడం వల్ల... ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయాన్ని మూసివేసినట్లు ఓ అధికారి స్పష్టం చేశారు. ఈ 20 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు పేర్కొన్న ఇంకో అధికారి.. పాలనా విభాగంలోని మరో 12 మందికీ వైరస్ సోకిందని తెలిపారు.
కరోనా కారణంగా ఇప్పటికే దేశ రాజధాని కాబూల్ లాక్డౌన్లో ఉంది. వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోన్న తరుణంలో ఇటీవలే లాక్డౌన్ను మరో 3 వారాలు పొడిగించారు.