ప్రతిష్ఠాత్మక 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఆఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్ గార్డె ఛాంపియన్‌గా నిలిచారు. 14 ఏళ్ల జైలా.. ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా రికార్డు సాధించారు. అంతేకాదు.. ఈ పోటీల 96 ఏళ్ల చరిత్రలో ఛాంపియన్‌గా నిలిచిన రెండవ నల్లజాతీయురాలిగా ఘనత పొందారు. 1998లో జోడి అన్నీ మ్యాక్స్‌వెల్ అనే విద్యార్థి.. 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో గెలుపొందిన తొలి నల్లజాతీయురాలిగా నిలిచారు. భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి తుమ్మల చైత్ర రన్నరప్‌గా నిలిచారు.
అమెరికాలోని ఫోర్లిడా రాష్ట్రంలో లేక్ బ్యూయేనా విస్టా వేదికగా స్పెల్లింగ్ బీ పోటీలు జరిగాయి. నిర్వాహకులు విజేతకు 50వేల డాలర్ల ప్రైజ్ మనీని అందించారు.
గిన్నిస్ రికార్డ్..
బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి అయిన జైలా.. మూడు గిన్నిస్ రికార్డులను సాధించారు. ఒకేసారి ఎక్కువ బంతులతో బాస్కెట్‌బాల్ ఆడినందుకుగానూ ఆమె ఈ ఘనతను పొందారు.
మెరిసిన భారత సంతతి విద్యార్థులు..
గత కొన్నేళ్లగా 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న భారత సంతతి విద్యార్థులు ఈసారి కూడా రాణించారు. ఈ పోటీలో రెండు, మూడు స్థానాలను భారత సంతతి విద్యార్థులు చైత్ర తుమ్మల (12) , భావన మదిని (13) దక్కించుకున్నారు. ఈ ఫైనల్స్‌లో పాల్గొన్న 11 మందిలో 9 మంది భారత సంతతికి చెందిన విద్యార్థులే ఉండటం విశేషం.
1999 నుంచి ఇప్పటివరకు మొత్తం 26 మంది భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
ఈ కార్యక్రమానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్.. విజేత జైలా అవంత్ను అభినందించారు.
ఇదీ చూడండి :నాన్న బర్త్‌డేకు ఇలాంటి కానుకా?