తెలంగాణ

telangana

ETV Bharat / international

దృష్టంతా కరోనా 1.0 కట్టడిపైనే: డబ్ల్యూహెచ్ఓ

ప్రస్తుతం కరోనా సంక్షోభం మొదటి దశ నడుస్తోందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. రెండో దశ గురించి ఆలోచించే బదులు.. ఇప్పటి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేయాలని సంస్థ ఎమర్జెన్సీస్ చీఫ్ అభిప్రాయపడ్డారు. కరోనా 1.0 నుంచి పాఠాలు నేర్చుకుంటే.. రెండో దశను సమర్థవంతంగా ఎదుర్కోగలగుతామన్నారు.

WHO urges focus on first wave of coronavirus
ప్రస్తుతానికి కరోనా 1.0 పైనే దృష్టి పెట్టండి: డాక్టర్ మైఖేల్ ర్యాన్

By

Published : Jul 4, 2020, 12:44 PM IST

కరోనా సంక్షోభం రెండో దశ గురించి ఆలోచించే కంటే మొదటి దశపైనే ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్​ఓ ఎమర్జెన్సీస్ చీఫ్ డాక్టర్ మేఖేల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం కరోనా సంక్షోభం మొదటి దశ నడుస్తోంది. కొవిడ్ కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండో దశ కరోనా సంక్షోభం గురించి ఆలోచించడం సరికాదు. ముందుగా ఇప్పటి పరిస్థితులను సరిదిద్దేందుకు కృషి చేయాలి. దీని నుంచి సరైన పాఠాలు నేర్చుకుంటే, రెండో దశలో కరోనాతో పోరాడటం సులభమవుతుంది."

- డాక్టర్ మైఖేల్ ర్యాన్, డబ్ల్యూహెచ్​ఓ ఎమర్జెన్సీస్ చీఫ్

మైఖేల్ ర్యాన్ ప్రకారం, ప్రస్తుతం కరోనా మొదటి దశలో... రెండో పీక్ నడుస్తోంది. అయితే మహమ్మారిని నియంత్రించడంలో ప్రపంచదేశాలు సఫలం కాలేదని ఆయన పేర్కొన్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కరోనాను సమర్థవంతంగా నియంత్రించాలంటే, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం సహా వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అలాగే కరోనా రోగుల కాంటాక్ట్​లు సహా కొవిడ్ కేసుల ట్రాకింగ్ కూడా తప్పనిసరని స్పష్టం చేసింది.

ఆయా దేశాల్లో ఉన్న కరోనా ఉద్ధృతిని అనుసరించి అక్కడి ప్రభుత్వాలు... వైరస్ నివారణ కోసం తగిన విధివిధానాలు అమలుచేయాలని డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:దక్షిణ చైనా సముద్రంలో అమెరికా అణ్వాయుధ నౌకలు

ABOUT THE AUTHOR

...view details