పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకున్న వేళ.. ఇరాన్‌ను మరోమారు తీవ్రంగా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్లపైనా, అమెరికా ఆస్తులపైనా దాడి చేయడానికిఇరాన్ ప్రయత్నిస్తే.. సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్‌కు సంబంధించిన 52 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని.. వాటిపై ఎంతో వేగంగా, ఎంతో బలంగా దాడి చేయడానికి సిద్ధమని ట్వీట్ చేశారు.
"ఇరాన్ ఉగ్రనేత(సులేమానీ) నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాం. సులేమానీ తన జీవితంలో ఎందరినో చంపాడు. మరెందరినో గాయపరిచాడు. కానీ మాపై ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ అంటోంది. ఇరాన్ ఎన్నో ఏళ్ల నుంచి సమస్యలను సృష్టిస్తూనే ఉంది. ఆ దేశానికి ఇదొక హెచ్చరికలా ఉండాలి. అమెరికన్లకైనా, అమెరికా ఆస్తులకైనా ఇరాన్ వల్ల నష్టం జరగకూడదు. ఒక వేళ అదే జరిగితే.. మేము ఇప్పటికే ఇరాన్‌కు చెందిన 52 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాం. వాటిల్లో ఇరాన్‌కు ముఖ్యమైనవి, చారిత్రకమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిపై ఎంతో వేగంగా, ఎంతో బలంగా దాడి చేస్తాం."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
అమెరికా దళాలే లక్ష్యంగా బగ్దాద్లోశనివారంరాకెట్ దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్ అధికారులు స్పష్టం చేశారు.