అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి సభ్య దేశాలతో సమాన హోదాను భారత్‌కు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది సెనేట్. నెలాఖరులోగా ఈ బిల్లును ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
భారత్‌కు నాటో భాగస్వామి హోదా - US
భారత్‌కు నాటో మిత్రదేశాల హోదా కల్పించే బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయసభలు ఆమోద ముద్ర వేస్తే ఈ బిల్లు చట్టంగా రూపుదిద్దుకోనుంది. ఫలితంగా.. భవిష్యత్తులో పరస్పరం సహకరించుకునే అవకాశం కలగనుంది.
భారత్‌కు నాటో భాగస్వామి హోదా
అక్కడా బిల్లు ఆమోదం పొందితే ఇజ్రాయెల్, దక్షిణ కొరియా వంటి దేశాల మాదిరిగా అమెరికాతో రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకొనేందుకు వీలు కలుగుతుంది. హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సముద్రపు దొంగతనాలను అడ్డుకోవటం, సముద్రంలో భద్రత వంటి అంశాల్లో అమెరికా తోడ్పాటునందిస్తుంది.