తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కోరల్లో అమెరికా.. లక్ష దాటిన కేసులు

అమెరికాలో కరోనా మహమ్మారి అంతకంతకూ కోరలు చాచుతోంది. శుక్రవారం ఒక్కరోజే 18వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటినట్లు ఆ దేశ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఒక్కరోజులోనే 345 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్​లోనూ 24 గంటల్లో 299 మంది మరణించారు.

By

Published : Mar 28, 2020, 5:05 AM IST

corona in america
కరోనా కోరల్లో అమెరికా

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో ఏకంగా 18వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,00,000 దాటింది. 345 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,475కు చేరింది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇన్ని కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.

వారం రోజుల క్రితం అమెరికాలో వైరస్​ బాధితుల సంఖ్య కేవలం 8వేలు. ప్రస్తుతం ఆ సంఖ్య 12 రెట్లకుపైగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఫ్రాన్స్​లో 299 మంది మృతి..

ఫ్రాన్స్​లోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 299 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,995కు చేరింది. కరోనా బారిన పడిన వారి సంఖ్య 32,964కి పెరిగింది.

దక్షిణ ఆఫ్రికాలో

దక్షిణాఫ్రికాలో లాక్​డౌన్​ విధించిన అనంతరం రెండు మరణాలు సంభవించాయి. కరోనా పాజిటివ్​గా తేలిన కేసుల సంఖ్య 1000కి చేరింది. అయితే.. మొత్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,500లకు చేరుకోగా.. ఇప్పటి వరకు 94 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ఇటలీలో 24 గంటల్లో సుమారు 1000 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details