భారత్కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేసేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్రంప్ పాలనా యంత్రాంగం అమెరికా కాంగ్రెస్కు నోటిఫికేషన్ సమర్పించింది. దాదాపు 155 మిలియన్ డాలర్ల విలువైన హర్పూన్ మిస్సైళ్లు, తేలికపాటి టార్పిడోలను భారత్కు విక్రయించనున్నట్లు అందులో పేర్కొంది.
భారత్కు విక్రయించే ఆయుధాల వివరాలు..
- సుమారు 92 మిలియన్ డాలర్ల విలువైన ఏజీఎం-84ఎల్ హర్పూన్ క్షిపణులు 10.
- ఎంకే 54 ఆల్ ఆప్ రౌండర్ తేలికపాటి టార్పిడోలు 16.
- ఎంకే 54 ఎక్సర్సైజ్ టార్పిడోలు 3.
- వీటి విలువ దాదాపు 63 మిలియన్ డాలర్లు.
రక్షణ వ్యవస్థ మరింత పటిష్ఠం