తెలంగాణ

telangana

ETV Bharat / international

"వేరే మార్గాలు ఎంచుకోక తప్పదు" - చైనా

జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ విషయంలో చైనా తీరుపై పలు ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చైనా ఇలాగే అడ్డుకుంటే ఇతర మార్గాలు ఎంచుకోక తప్పదని హెచ్చరించాయి.

"వేరే మార్గాలు ఎంచుకోక తప్పదు"

By

Published : Mar 14, 2019, 6:53 PM IST

జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను అడ్డుకున్న చైనాపై ఐరాస భద్రతా మండలిలోని పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చైనా తన తీరును మార్చుకోకపోతే ఇతర మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించాయి.

"వేరే మార్గాలు ఎంచుకోక తప్పదు"

"అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని చైనా అడ్డుకుంటే మేము ఇతర మార్గాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. పరిస్థితి అంత వరకు రాకుడదని కోరుకుంటున్నాం."
---- భద్రతా మండలిలోని ఓ దౌత్యవేత్త.

అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించాలన్న భారత్​ ప్రతిపాదనను డ్రాగన్​ దేశం అడ్డుకోవడం ఇది నాలుగోసారి.

దేశంలోని ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను కొనసాగించడం కోసం.. చైనా సహాయం తీసుకుంటున్న పాకిస్థాన్​పై మరో సభ్య దేశం మండిపడింది. ఎట్టిపరిస్థితుల్లోనైనా మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని తేల్చిచెప్పింది.

ABOUT THE AUTHOR

...view details