తెలంగాణ

telangana

By

Published : Dec 26, 2019, 6:16 PM IST

ETV Bharat / international

'ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన యువతి మలాలా'

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన యువతిగా అరుదైన ఘనతను సాధించారు పాకిస్థాన్​ సామాజిక కార్యకర్త మలాలా​. దశాబ్ద కాలంగా జరిగిన సంఘటనలపై సమీక్షా నివేదిక రూపొందించిన ఐరాస ఈ విషయాన్ని తెలిపింది.

un-declares-malala-decades-most-famous-teenager
'ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన యువతి మలాలా'

పాకిస్థాన్​ సామాజిక కార్యకర్త, నోబెల్​ గ్రహీత మలాలా యూసుఫ్​జాయ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.​ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన యువతిగా మలాలాను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 'డికేడ్​ ఇన్​ రివ్యూ' రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది.

సమీక్షలో భాగంగా 2010 నుంచి 2013 చివరి వరకు జరిగిన సంఘటనలను సమీక్షకు స్వీకరించింది ఐరాస. 2010లో హైతీ భూకంపం, 2011 ప్రారంభంలో సిరియాలో జరిగిన పోరాటాల కన్నా, 2012లో చిన్నారులు విద్యను అభ్యసించడం వారి ప్రాథమిక హక్కుగా మలాలా చేసిన కృషి ఎక్కువ ప్రసిద్ధి పొందినట్లుగా గుర్తించినట్లు ఐరాస పేర్కొంది.

2014లో మలాలా నోబెల్​ శాంతి బహుమతిని పొందారు. అది జరిగిన రెండేళ్లకు ఆమె హత్యకు తాలిబన్లు విఫలయత్నం చేశారు.

"తాలిబన్లు చేసిన దాడి ప్రపంచవ్యాప్తంగా అలజడిని సృష్టించింది. ఈ చర్యను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. అదే ఏడాది మానవ హక్కుల రోజు సందర్భంగా చిన్నారులు పాఠశాలకు వెళ్లటం వారి ప్రాథమిక హక్కు అని, బాలికలు విద్యను అభ్యసించటం తప్పనిసరి చేయాలని పారిస్​లోని యునెస్కో కార్యాలయంలో ఉద్ఘాటించారు మలాలా."
-ఐరాస రిపోర్టు.

22ఏళ్ల మలాలాను మేగజీన్​ కవర్​ పర్సన్​గా ఇటీవలే ఎంపిక చేసింది టీన్​ వోగ్. ​

ఇదీ చూడండి:'ప్రజలను హింసకు ఉసిగొల్పడం నాయకత్వం కాదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details