తెలంగాణ

telangana

By

Published : Dec 12, 2019, 10:42 PM IST

ETV Bharat / international

చైనాతో ఒప్పందానికి చేరువయ్యాం: ట్రంప్

చైనాతో వాణిజ్య చర్చలపై ట్వీట్​​ చేశారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డ్రాగన్ దేశంతో వాణిజ్య ఒప్పందం అత్యంత సమీపానికి చేరుకున్నట్లు వెల్లడించారు.

trump
చైనాతో ఒప్పందానికి చేరువయ్యాం: ట్రంప్

చైనాతో వాణిజ్య చర్చలపై స్పందించారుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాణిజ్య చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని, ఒప్పందంలో అత్యంత సమీపానికి చేరుకున్నామని ట్వీట్​ చేశారు.

"చైనాతో భారీ ఒప్పందానికి అత్యంత సమీపంలో ఉన్నాం. వారు కోరుకుంటున్నారు. మేం చేస్తున్నాం."

-ట్రంప్ ట్వీట్

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు గత కొద్ది నెలలుగా వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య చర్చలు ముగింపు దశకు చేరుకున్నట్లు వెల్లడించారు ట్రంప్.

ఇదీ చూడండి: 'పౌర' సెగ: పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details