తెలంగాణ

telangana

ETV Bharat / international

"ఆమె నా మాట విననందుకే.."

బ్రెగ్జిట్ ఒప్పందం​పై బ్రిటన్ పార్లమెంట్​లో జరిగిన చర్చల తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పదునైన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన సలహా వినలేదని అందుకే ఆమె తీర్మానం ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.

By

Published : Mar 15, 2019, 10:16 AM IST

బ్రెగ్జిట్​పై ట్రంప్​ సునిశిత వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, బ్రెగ్జిట్​పై బ్రిటన్​ పార్లమెంట్​లో చర్చించిన తీరును విమర్శించారు. బ్రెగ్జిట్​పై చర్చలు స్వేచ్ఛగా జరగలేదని, ఇది దేశ విభజనకు కారణమౌతుందని ట్రంప్​ అభిప్రాయపడ్డారు.

బ్రెగ్జిట్​పై ఎలా చర్చలు నిర్వహించాలో బ్రిటన్ ప్రధాని థెరిసా మేకి చెప్పానన్నారు ట్రంప్​. అయితే థెరిసా తన సలహా పాటించలేదని అందుకే ఆమె తీర్మానం వీగిపోయిందని ఎద్దేవా చేశారు.

28 దేశాలు సభ్యులుగా ఉన్న ఐరోపా సమాఖ్య​ నుంచి బ్రిటన్ వైదొలగడానికి ఉన్న గడువును మరో మూడు నెలల వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నిజానికి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి మార్చి 29తో గడువు ముగుస్తుంది. కానీ థెరిసా ప్రభుత్వ అభ్యర్థన మేరకు బ్రెగ్జిట్​ను మూడు నెలలు అంటే జూన్​ 30 వరకు గడువు పొడిగిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

ఐరిస్​ ప్రధాని లియో వరాద్కర్​ శ్వేతసౌధానికి వెళ్లారు. సెయింట్​ పాట్రిక్​ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. వరాద్కర్​ బ్రిగ్జెట్​ వ్యతిరేకి. ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగితే అది ఉత్తర ఐర్లాండ్​పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వరాద్కర్​ వాదనను ట్రంప్​ సమర్థించారు. త్వరలోనే సమస్య తొలగిపోతుందని, బ్రెగ్జిట్​ నిర్ణయం బ్రిటన్ వెనుకకు తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఏదైనా తలచుకుంటే సాధ్యమేనని ట్రంప్​ విశ్వాసం వ్యక్తం చేశారు.


ABOUT THE AUTHOR

...view details