తెలంగాణ

telangana

ETV Bharat / international

కష్టాల్లో ట్రంప్.. గట్టెక్కేందుకు​ హోటళ్ల అమ్మకం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబానికి చెందిన ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ను(Trump international hotel) విక్రయించనున్నారు. భవిష్యత్తులో ఈ హోటల్‌ పేరు వాలడ్రోఫ్‌ ఆస్టోరిగా మారనుంది. దీనిని హిల్టన్‌ గ్రూప్‌ నిర్వహించనుంది.

By

Published : Nov 15, 2021, 2:35 PM IST

trump hotel
ట్రంప్ హోటళ్లు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald trump) కుటుంబానికి చెందిన భారీ హోటళ్లను విక్రయించేస్తున్నారు. తాజాగా వాషింగ్టన్‌లోని ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ను(Trump international hotel) విక్రయించేందుకు డీల్‌ కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో ఈ హోటల్‌(Trump international hotel) పేరు వాలడ్రోఫ్‌ ఆస్టోరిగా మారనుంది. దీనిని(Trump hotel) హిల్టన్‌ గ్రూప్‌ నిర్వహించనుంది. 263 గదులున్న ఈ భవనాన్ని ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ 60 ఏళ్ల లీజుకు తీసుకొంది. 2016లో ఈ హోటల్‌(Trump international hotel) కార్యకలాపాలను ప్రారంభించింది. వాస్తవానికి రిపబ్లికన్లకు ఇది కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచినా.. ఇటీవల కరోనా వ్యాప్తి కారణంగా భారీగా నష్టాలు వచ్చాయి. మొత్తం నష్టం 70 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని ఇటీవల బయటపడింది. 2019 నుంచే దీన్ని విక్రయించాలని నిర్ణయించినా.. బయ్యర్లు లభించలేదు.

తాజాగా మియామీకి చెందిన సీజీఐ మర్చంట్‌ గ్రూప్‌ దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి ఈ డీల్‌ పూర్తికావచ్చని వాల్‌ స్ట్రీట్‌ పేర్కొంది. శ్వేత సౌధానికి ఒక్క మైలు దూరంలోని పెన్సెల్వేనియా అవెన్యూలోని పోస్టాఫీస్‌ భవనం ఈ హోటల్‌గా(Trump international hotel) మారింది. 2012లో దీనిని అభివృద్ధి చేసేందుకు అంగీకారం కుదిరింది. 2016లో ట్రంప్‌ నామినేషన్‌ వేసిన కొన్ని వారాల్లో ఈ హోటల్‌ పనిచేయడం మొదలైంది. ఇటీవల ట్రంప్‌ తన హోటల్‌ వ్యాపార లాభాల్ని బాగా ఎక్కువ చేసి 150 మిలియన్‌ డాలర్లుగా చూపినట్లు తేలింది. వాస్తవానికి దీనిపై అమెరికా కాంగ్రెస్‌ దర్యాప్తు చేపట్టి 70 మిలియన్‌ డాలర్లు నష్టం వచ్చినట్లుగా తేల్చింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details