అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయం వీడే సమయంలో తీవ్రవిమర్శల పాలవుతున్నారు. డబ్బులు తీసుకొని అధ్యక్షుడు కొందరికి క్షమాభిక్షను ప్రసాదించారా అనే అంశంపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ దృష్టి సారించింది. ఈ విషయాన్ని ఆంగ్లపత్రిక ది గార్డియన్ పేర్కొంది. దీనిలోని వ్యక్తుల పేర్లను వెల్లడించకుండా పూర్తిగా ఎడిట్ చేసిన డాక్యుమెంట్‌ను బహిర్గతం చేశారు. దీనిలో అధ్యక్షుడు ట్రంప్ సహా మరే అధికారి పేరును పేర్కొనలేదు.
క్షమాభిక్షలపై దర్యాప్తు ఓ ఫేక్ న్యూస్: ట్రంప్ - ట్రంప్ క్షమాబిక్షలో డబ్బు పాత్ర
శ్వేతసౌధాన్ని వీడే సమయంలో ట్రంప్ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. డబ్బులు తీసుకొని ట్రంప్ కొందరికి క్షమాభిక్ష ప్రసాదించారని, దీనిపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ దృష్టి సారించిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ట్రంప్.. క్షమాభిక్షలపై దర్యాప్తు ఓ ఫేక్ న్యూస్ అని ట్వీట్ చేశారు.
ఈ పత్రంలో చాలాకీలక అంశాలను ప్రస్తావించారు. ట్రంప్ ఆఫీస్‌ను వీడటానికి ముందే చాలా మందికి క్షమాభిక్ష ప్రసాదించే విషయాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులు లాబీయిస్టులా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. శ్వేతసౌధం మంజూరు చేసిన క్షమాభిక్షల్లో డబ్బుపాత్ర ఉందా అనే అంశంపై చేస్తున్న దర్యాప్తు ఏ అధికారిని ఉద్దేశించి కాదని జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ట్రంప్ దీనిపై తనదైన శైలిలో స్పందించారు. 'క్షమాభిక్షలపై దర్యాప్తు ఓ ఫేక్ న్యూస్' అని ఆయన మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:వచ్చే వారం రష్యాలో సామూహిక వ్యాక్సినేషన్!