అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాక్సింగ్ ఛాంపియన్ అవతారమెత్తారు. కండలు తిరిగిన దేహంతో ఛాంపియన్ బెల్ట్ ధరించి.. బిగబట్టిన పిడికిలితో ఆయన.. ఓ బాక్సింగ్ పోటీదారుడికి తీసిపోని విధంగా ఉన్నారు. అయితే ఇది చిత్రాల్లో మాత్రమే. 80వ దశకంలో హాలీవుడ్ దిగ్గజ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన 'రాకీ 3' చిత్రంలోని రాకీ బాల్బోవా పాత్రకు సంబంధించిన పోస్టర్‌కు తన తలను ఫొటోషాప్ ద్వారా అతికించిన చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు.
ఇటీవలే ఓ ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా వెళ్లారు ట్రంప్. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. వాటికి చెక్ పెట్టడానికే కండల వీరుడు రాకీ చిత్రాన్ని మార్చి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.