స్కూల్లో పరిచయమైన 15 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది ఓ టీచర్. 41 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ టీచర్‌ను అరెస్టు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో గురువారం ఈ ఘటన జరిగింది.
ఫోరిడా మయామి డేడ్ కౌంటీలోని జాన్ స్మిత్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది హైరీ కాల్వి. అదే క్యాంపస్‌లో ఉన్న మరో స్కూల్లోని 15 ఏళ్ల విద్యార్థితో రిలేషన్లో ఉంది. గతంలో ఆ విద్యార్థి చదివే స్కూల్లో బోధించినప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చి నుంచి వీళ్లిద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే విద్యార్థిని టీచర్ లైంగికంగా వేధించిందా? అనే అనుమానంతో పోలీసులు అతడిని ప్రశ్నించారు. కానీ అతడు అలాంటిదేమీ లేదని బదులిచ్చాడు. టీచర్‌తో సెక్స్ చేసిన వీడియోలను క్లాస్‌లోని విద్యార్థులందరికీ తాను చూపించినట్లు పోలీసులకు వెల్లడించాడు.