తెలంగాణ

telangana

ETV Bharat / international

మెక్సికోలో లక్ష మార్క్​ దాటిన కరోనా మరణాలు

ప్రపంచ దేశాలపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. రోజువారీ కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. కరోనా మరణాల్లో అమెరికా, భారత్​, బ్రెజిల్​ల సరసన చేరింది మెక్సికో. లక్ష మార్క్​ అందుకున్న నాలుగో దేశంగా నిలిచింది.

Corona virus
మెక్సికోలో లక్ష మార్క్​ దాటిన కరోనా మరణాలు

By

Published : Nov 20, 2020, 10:05 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరనా మహమ్మారి మాహావిలయం కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో వైరస్​ రెండోవేవ్​ ప్రారంభమవటం వల్ల కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మెక్సికోలో కరోనా మరణాలు లక్ష దాటాయి. అమెరికా, భారత్​, బ్రెజిల్​ల తర్వాత ఈ మార్క్​ అందుకున్న నాలుగో దేశంగా నిలిచింది మెక్సికో.

మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య 100,104కు చేరినట్లు ప్రకటించారు ఆ దేశ అంటువ్యాధుల విభాగం డైరెక్టర్​ జోస్​ లూయిస్​ అలోమియా జెగర్రా. మొత్తం కేసుల సంఖ్య 10.19 లక్షలు దాటినట్లు చెప్పారు. అయితే.. 7.66 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకోవటం కాస్త ఊరట కలిగిస్తోంది. వైరస్​ విజృంభణపై మెక్సికో ప్రజల్లో భిన్నప్రవర్తనలు ఉన్నాయి. సగం మంది వైరస్​ను లెక్కచేయకుండా, మాస్క్​లు ధరించకుండా తిరుగుతుంటే.. మరోవైపు వైరస్​ భయంతో కొందరు ఒత్తిడికి లోనవుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసులు వివరాలు..

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 12,070,712 258,333
బ్రెజిల్​ 5,983,089 168,141
ఫ్రాన్స్​ 2,086,288 47,127
రష్యా 2,015,608 34,850
స్పెయిన్​ 1,574,063 42,291
యూకే 1,453,256 53,775

ABOUT THE AUTHOR

...view details