తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2020, 10:36 PM IST

ETV Bharat / international

'లాక్​డౌన్​ వేగంగా ఎత్తివేస్తే కరోనాకు తిరిగి ఊపిరిపోసినట్లే'

ప్రస్తుతం విధించిన లాక్​డౌన్​ను వేగంగా ఎత్తివేయటం వల్ల వైరస్​ వ్యాప్తి మరింత పుంజుకునే అవకాశం ఉందని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ విషయంలో ప్రతిఒక్కరూ ఆచితూచి వ్యవహరించాలని సూచించింది.

Lifting virus restrictions too quick could spark 'deadly resurgence': WHO
'లాక్​డౌన్​ వేగంగా ఎత్తివేస్తే కరోనాకు తిరిగి ఊపిరిపోసినట్లే'

ప్రస్తుత పరిస్థితుల్లో లాక్​డౌన్​ను ఎత్తివేయడం మరింత ప్రమాదకరమని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ). కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్​డౌన్​ను వేగంగా ఎత్తివేస్తే.. వైరస్​ మరింత ప్రాణాంతకంగా మారేందుకు పునరుజ్జీవనం పోసినట్లేనని ప్రపంచ దేశాలను హెచ్చరించింది.

"ప్రతిఒక్కరూ ఆంక్షలను ఎత్తివేయాలని డబ్ల్యూహెచ్​ఓ కోరుకుంటోంది. అదే సమయంలో లాక్​డౌన్​ను వేగంగా ఎత్తివేయడం వల్ల వైరస్​ పుజరుజ్జీవనం పోసుకుని మరింత ప్రాణాంతకంగా మారే అవకాశముంది. ఈ క్లిష్టపరిస్థితులను సమర్థమంతంగా ఎదుర్కోకపోతే సమస్య మరింత జటిలం అవుతుంది."

-టెడ్రోస్​, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్​.

ఇదీ చూడండి:అగ్రరాజ్యాలకన్నా భారత్​లోనే మరణాల రేటు తక్కువ!

ABOUT THE AUTHOR

...view details