తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనాపై పోరులో భారతీయుల బలాన్ని ప్రదర్శించారు' - భారతీయ-అమెరికన్లు

కరోనా మహమ్మారిపై పోరులో అమెరికాలోని ప్రవాస భారతీయులు నాయకత్వాన్ని వహించారని కొనియాడారు భారత రాయబారి తరన్ జిత్ సింగ్ సంధు. ప్రవాస భారతీయుల బలాన్ని చూపారని మెచ్చుకున్నారు. ఆరోగ్య కార్యకర్తలుగా, వైద్యులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులుగా ఎనలేని సేవలందిస్తున్నట్లు ప్రశంసించారు.

Ambassador Sandhu
భారతీయ-అమెరికన్లు

By

Published : Apr 30, 2020, 3:03 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో భారతీయ-అమెరికన్లు అద్భుత పోరాట ప్రతిభను ప్రదర్శిస్తున్నారని కొనియాడారు అమెరికాలోని భారత రాయబారి తరన్ జిత్ సింగ్ సంధు. ఈ విపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి నాయకత్వాన్ని చూపుతున్నారని మెచ్చుకున్నారు.

అమెరికాలోని ప్రవాస భారతీయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సంధు. ఈ సందర్భంగా వారి సేవలను ప్రశంసించారు.

" కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ప్రవాస భారతీయులు భారత రాయబార కార్యాలయానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు ముందుకు వచ్చి నాయకత్వాన్ని చూపుతున్నారు. ప్రవాస భారతీయుల బలాన్ని ప్రదర్శించారు. మీరు భారత్ కే కాదు అమెరికాకు కూడా ఒక ఉదాహరణగా నిలిచారు. మీలోని చాలా మంది అందిస్తున్న నిస్వార్థ సేవకు ఇక్కడి నాయకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. నాకు చాలా గర్వంగా ఉంది. కరోనాపై పోరులో భారతీయ అమెరికన్లు ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులుగా ఎనలేని సేవ చేస్తున్నారు. భారత్, అమెరికాల బంధానికి మీరు ముఖ్యమైన భాగస్వాములు. ఇరుదేశాలు కలిసి పనిచేసేందుకు మీరే ఉమ్మడి బంధం. "

-తరన్ జిత్ సింగ్ సంధు, అమెరికాలో భారత రాయబరి

5వేలకుపైగా గదుల ఏర్పాటు..

లాక్ డౌన్ కారణంగా అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు.. పలు విశ్వవిద్యాలయాల్లో వసతి గృహాలను కొనసాగించడానికి అనుమతించటంలో విజయవంతమైనట్లు పేర్కొన్నారు సంధు. కొన్ని విద్యాలయాల్లో వసతి లేక విద్యార్థులకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో భారతీయ హోటల్ యజమానులు విద్యార్థులు, ఇతర పర్యటకులకు వసతి కల్పించేందుకు ముందుకు వచ్చారని ప్రశంసించారు. ప్రవాస భారతీయుల నుంచి సేకరించిన వనరుల ద్వారా సుమారు 5వేలకుపైగా గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు తనకు చాలా గర్వంగా ఉందని.. భారతీయ హోటల్ యజమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు మందులు అందించేందుకు ఏఏపీఐ ద్వారా ఈ-మెయిల్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సంధు.

ఇదీ చూడండి:కరోనాపై పోరులో భారత్​కు అమెరికా ఆర్థిక సాయం!

ABOUT THE AUTHOR

...view details