తెలంగాణ

telangana

కరోనా కోసమని ఆ మాత్ర వాడితే చూపు తగ్గుతుంది!

By

Published : Apr 7, 2020, 10:51 AM IST

కరోనా తీవ్రరూపం దాల్చుతున్నకొద్దీ ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. వైరస్​ బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు వైద్యులు ఎక్కువగా హైడ్రాక్సీ క్లోరోక్విన్​ మాత్రలను సిఫారసు చేస్తున్నారు. అయితే ఈ మాత్ర అంత మంచిది కాదని.. భవిష్యత్తులో కంటి రెటీనాపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

hydroxy chloroquine
మాత్ర ఎక్కువైతే... చూపు తగ్గుతుంది!

రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను ఇవ్వడం ద్వారా కరోనాను దూరం చేయవచ్చని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వైద్యులు దీనిని సిఫారసు చేస్తున్నారు. ఈ ఔషధం సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా పరిశీలనలు సాగుతూనే ఉన్నాయి. తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను పంపాలని సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌... మన ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌ చేసి అడిగారు. ఈ నేపథ్యంలో ఈ ఔషధం వాడకం, దాని సామర్థ్యంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

మాత్ర ఎక్కువైతే... చూపు తగ్గుతుంది!

మోతాదుకు మించివాడితే అంతే..

దీర్ఘకాలిక వ్యాధులు, వ్యాధి నిరోధక సమస్యలతో ఇబ్బందిపడే రోగులకు ఇచ్చేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు సురక్షితమే అయినప్పటికీ... ఈ ఔషధాన్ని మోతాదుకు మించి వాడితే నేత్ర సంబంధిత ఇబ్బందులు వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హెచ్చు మోతాదులో సుదీర్ఘకాలం ఈ మందులను వాడటం వల్ల కొందరు రోగుల కళ్లలో రెటీనా చుట్టూ విషపూరిత పొర ఏర్పడినట్లు, చూపు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. మరికొందరిలో వికారం, వాంతులు, తిమ్మిర్లు, విరేచనాలు తదితర సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. కరోనా రోగులు ఈ మాత్రలను విచ్చలవిడిగా కాకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడుతూ మోతాదుకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఇదీ చదవండి:కరోనా కాలాన పరీక్షా సమయమిది!

ABOUT THE AUTHOR

...view details