ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలోని అగ్రశ్రేణి చమురు కంపెనీల సీఈఓలతో జరిగిన సమావేశంలో ఇంధన రంగానికి సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. అమెరికా సహజ వాయువు సంస్థ టెల్లూరియన్, భారత్‌కు చెందిన పెట్రోనెట్‌లు మోదీ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
మోదీ ఎఫెక్ట్: చమురు సంస్థల మధ్య కీలక ఒప్పందం - మోదీ
చమురు కంపెనీల సీఈఓల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో కీలక ఒప్పందం కుదిరింది. భారత్‌కు చెందిన పెట్రోనెట్, అమెరికా సంస్థ టెల్లూరియన్లు ఏడాదికి 5 మిలియన్ టన్నుల ద్రవీకృత సహజవాయువు కొనుగోలుపై అవగాహన ఒప్పందం చేసుకున్నాయి.
మోదీ ఎఫెక్ట్: ఇరుదేశాల చమురు సంస్థల మధ్య కీలక ఒప్పందం
ఏడాదికి 5 మిలియన్ టన్నుల ద్రవీకృత సహజవాయువు కొనుగోలుపై పెట్రోనెట్ దాని అనుబంధ సంస్థలు టెల్లూరియన్‌తో ఎంఓయూ చేసుకున్నాయి. ఈ ఒప్పందం.. ఈక్విటీ పెట్టుబడితో పాటుగా, డైరెక్టర్ల బోర్డు ఆమోదానికి లోబడి ఉంటుందని రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ అవగాహన ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తామని టెల్లూరియన్ సంస్థ తెలిపింది.
ఇదీ చూడండి: హౌడీ మోదీ ఎందుకింత ప్రత్యేకమంటే..!
Last Updated : Oct 1, 2019, 1:07 PM IST